గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:33 IST)

సైరా సెన్సార్ టాక్ ఏంటి..? ఇంత‌కీ ఎంత బిజినెస్ అయ్యింది..?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆతృత‌గా మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 
 
ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్‌ను ఇచ్చింది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమాని అక్టోబ‌ర్ 2న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. 
 
ఈ సంచ‌ల‌న చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా, నిహారిక‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా ఇప్ప‌టికే  తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇప్పుడు డిజిట‌ల్ మార్కెటింగ్ లో సైరా సెన్సేష‌న్‌కు తెర తీసింది. మేట‌ర్ ఏంటంటే... ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ 40 కోట్లు చెల్లించి ద‌క్కించుకుంద‌ని టాక్‌. 
 
అలాగే సినిమా అన్ని భాష‌ల‌కు క‌లిపి రూ.125 కోట్లమేర‌కు చెల్లించి జీ నెట్‌వ‌ర్క్ శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఇలా... రిలీజ్ కి ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సైరా రిలీజ్ త‌ర్వాత ఇంకెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.