బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (20:37 IST)

బుల్లితెర హాస్యనటుడు సునీల్ హోల్కర్ మృతి.. చివరి స్టేటస్ ఇలా..?

Sunil Holkar
Sunil Holkar
బుల్లితెర నటులు తునీషా శర్మ, వైశాలి ఠక్కర్, దీపేష్ భాన్‌లు గత సంవత్సరం మరణించారు. తాజాగా మరో బుల్లితెర నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. తారక్ మెహతా ఫేమ్ సునీల్ హోల్కర్ 40 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సునీల్ హోల్కర్ తన హాస్య నటుడిగా అందరికీ పరిచయం. తారక్ మెహతా కా ఊల్తా చష్మా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈయనకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
సునీల్ మరణానికి కారణం తీవ్రమైన లివర్ సిర్రోసిస్‌ అని వైద్యులు ధ్రువీకరించారు. సునీల్ హోల్కర్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
చివరి నిమిషంలో తన తరపున తన వాట్సాప్‌లో చివరి స్టేటస్‌ను షేర్ చేయమని తన స్నేహితుడిని కోరాడు. ఆఖరిసారిగా అందరికీ వీడ్కోలు పలుకుతూ లవ్ యు చెప్పాలనుకున్నాడు. జీవితంలో తాను చేసిన తప్పులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ స్టేటస్ నెట్టింట వైరల్ అవుతోంది.