తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ సినిమా డబ్బింగ్ ప్రారంభం
Tarun Bhaskar, Esha Rebba and team
మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు.
కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ్ ఏ మూవీ ద్వారా పరిచయం అవుతున్నారు. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ బ్రహ్మానందం శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం జయ్ క్రిష్ . దీపక్ ఎరగరా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమని డైలాగ్స్ అందిస్తున్నారు.
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, బ్రహ్మాజీ ,శివన్నారాయణ,సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్