బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (18:10 IST)

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

vijay69
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ నటించే 69వ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆయన తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ పార్టీని కూడా స్థాపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను నటించే 69వ చిత్రంపై శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. 
 
అతను హీరోగా నటిస్తున్న చివరి సినిమా ఎనౌన్స్ అయింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పోస్టర్‌లో ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ ఎరైవింగ్ సూన్ అంటూ.. ముద్రించారు. విజయ్ రాజకీయాలలోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా డిజైన్ చేశారు‌. అక్టోబరు 2025 అంటూ సినిమా రిలీజ్‌ను కూడా ప్రకటించారు. 2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దానికి ముందు విడుదల కానున్న ఈ సినిమా విజయ్ రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడేలా ఉండనుందని తెలుస్తొంది.