బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:13 IST)

సాయిపల్లవికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పిన నాగచైతన్య

naga chaitanyai,  Sai Pallavi
naga chaitanyai, Sai Pallavi
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స కారుల జీవిత నేపథ్యంలో సాగే ఈ కథలో మత్సకారుడిగా రాజు అనే పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు. బుజ్జి అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా కోసం కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. మత్సకారుడిగా సముద్రం దాటి ఆవలి ఒడ్డుకు చేరుకున్న రాజుకు అనుకోకుండా బుజ్జి తారసపడడం ప్రేమ చగురిస్తుంది.
 
అలా చిగురించిన ప్రేమ మొక్కయ్యాక అనుకోని విధంగా జుజ్జి అలుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ సాంగ్ ను తెరకెక్కించారు. ఆ సందర్భంగా నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బుజ్జి అలకను చూసి బతిమాలుతూ బుజ్జి తల్లి వచ్చేస్తాను గదే. కాస్త నవ్వే.. అనే డైలాగ్ తో వీడియో వుంది. రాజు బుజ్జిలు మహాసముద్రాలు దాటి తమ ప్రేమను పంచుకున్నారు అనే కాన్సెప్ట్ తో ప్రేమికులకు ఎంకరేజ్ చేసేదిగా ఇది వుంది. గీతా ఆర్ట్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.