భావన మళ్లీ వస్తోంది.. ది డోర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి భావన.. ఆపై ఓ మలయాళ దర్శకుడిపై కేసు పెట్టింది. ఆపై పెళ్లి చేసుకుని సెటిలైన భావన ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో హీరోయిన్ నటించింది.
తాజాగా నటి భావన పుట్టినరోజు సందర్భంగా ఆమె 86వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జైదేవ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ 'ది డోర్' అనే సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌లో భావన లుక్ బాగుంది.
జూన్ డ్రీమ్స్ పతాకంపై నవీన్ రాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.