ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (17:18 IST)

స‌ల్మాన్ వ‌స్తేనే కిక్ వ‌చ్చింది - చిరంజీవి

Salman-chiru
గాడ్ ఫాదర్ మీకు స్వాగతం ప‌లుకుతున్నాడంటూ.. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌ను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. ముంబై సబర్బన్స్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో గాడ్ ఫాద‌ర్ షూట్ జ‌రుగుతోంది. బుధ‌వారంనాడు సల్మాన్ చిరంజీవితో షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు ట్వీట్‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా బోకేతో స్వాగ‌తం ప‌లుకుతూ, మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు ఆ అద్భుత  కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదని- చిరంజీవి పేర్కొన్నారు.

 
ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కంచరణా, హరీష్ ఉత్తమన్, సచిన్ ఖేడేకర్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నీరవ్ షా హ్యాండిల్ చేస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా  260 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొంద‌బోతోంది.