సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (16:54 IST)

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఎందుకు చేశారు?

krishna hero
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో చేశారు. పద్మాలయ స్టూడియో ఉండగా శ్మశానవాటికలో చేయడాని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు బదులిచ్చారు. 
 
తన సోదరుని అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేసినట్టు చెప్పారు. 
 
మరోవైపు కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ఈ మెమోరియల్ హాలులో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలను, ఫోటోలను, షీల్డులను భద్రంగా ఉంచనున్నట్టు తెలిపారు.