గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (15:54 IST)

చిరంజీవి తో అప్పుడు మిస్ అయిన అవ‌కాశాన్ని ఇప్పుడు ద‌క్కించుకున్న త‌మ‌న్నా

Chiru- Tamanna
త‌మ‌న్నా చెప్పిన మాట నిజ‌మైంది. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించాల‌ని కోరిక ఆమెకు గ‌తంలో వుండేది. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఆమెను ఓ న‌ర్త‌కిగా తీసుకున్నారు. కానీ ఆ చిత్ర క‌థా చ‌ర్చ‌ల్లో ముందుగా నాయిక‌గా త‌మ‌న్నాను అనుకున్నార‌ట‌. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల న‌ర్త‌కిగా త‌మ‌న్నా చేయాల్సి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ విష‌య‌మై ఆమె చిట్‌చాట్‌గా చెబుతూ, చిరంజీవిగారితో జోడిగా అనుకున్నాను. కానీ కొద్దిసేపు పాత్ర చేయాల్సివచ్చింది. అయినా స‌రే ఆయ‌న సినిమాలో న‌టిస్తే చాలు అనుకుని చేశాన‌ని తెలియ‌జేసింది. ఇప్పుడు ఆమె కోరిక‌ నెర‌వేరిన‌ట్ల‌యింది.
 
మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక తమన్నా, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది.
 
అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో  మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
 
చిరంజీవి మీద లుక్ టెస్ట్ చేశామని సోమవారం సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్ ప్రకటించారు.
 
యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి అద్బుతమైన నటీనటులు, సాంకేతిక బృందం పని చేయబోతోన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారు.
 
2022లో భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్
 
సాంకేతిక బృందం-  డైరెక్టర్ : మెహర్ రమేష్, నిర్మాత : రామబ్రహ్మం సుంకర,  బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్,  సంగీతం : మహతి స్వర సాగర్