మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (16:08 IST)

త్రిగుణ, మేఘా చౌదరి ల రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్

Triguna, Megha Chaudhary
Triguna, Megha Chaudhary
త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి,  షియజి షిండే, పోసాని కృష్ణమురళి,  రఘు బాబు, పృథ్వీ రాజ్,  మధు నందన్,  ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని,  జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్,  చందన