1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (12:16 IST)

నల్గొండ లో క్లైమాక్స్ చిత్రీకరణ చేయనున్న పోలీస్ వారి హెచ్చరిక

police vaari hecharika  song
police vaari hecharika song
నల్లపూసలు ఫేం  బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని  ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. 
 
ఈ సందర్భంగా  దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ  "అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్  యారాడా  బీచ్, నకిరేకల్  లాండ్స్, యస్ స్టూడియో మొదలైన  లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించామని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా  రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో  ఐదు లక్షల ప్రైవేట్  సాంగ్స్ ను  స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన  సంగీత దర్శకుడు " గజ్వేల్  వేణు" ను  యీ సినిమా ద్వారా వెండితెరకు  పరిచయం చేస్తున్నామని తెలిపారు.
 
చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ  "రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే  నల్గొండ లో  క్లైమాక్స్స న్నివేశాలను చిత్రీకరించడం తో  సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు.
 
ఇంకా ఈ సినిమాలో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద , జబర్దస్త్ పవన్, హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు నటిస్తున్నారు.