శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (14:25 IST)

చిరు ఆచార్యలో త్రిష నటిస్తుందా..?

చిరు-త్రిష
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల రాజమండ్రి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో చిరంజీవిపై ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగా నటిస్తున్నారని సమాచారం.
 
అయితే... ఇందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా 40 రోజులు డేట్స్‌కు గాను 40 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరోవైపు మహేష్ బాబుతో అనుకున్నప్పటికీ మళ్లీ ఆ పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తోనే చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు అఫిషియల్‌గా ప్రకటించలేదు. అలాగే త్రిష కూడా షూటింగ్‌లో జాయిన్ కాలేదు. దీంతో అసలు ఈ సినిమాలో త్రిష నటిస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. తాజా వార్త ఏంటంటే.. ఈ వారంలో త్రిష ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతుందట. చిరంజీవి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 
గతంలో చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమా చేసారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ భారీ చిత్రాన్ని ఆగష్టు 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి.. చిరు - కొరటాల కాంబినేషన్లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.