గురువారం, 27 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (21:00 IST)

త్రివిక్రమ్ కుమారుడు హీరో అవుతాడా? (video)

Trivikram’s Son
Trivikram’s Son
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం జనవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆపై ప్రాణ స్నేహితుడు పవన్ ఎన్నికల హడావుడిలో ఆయన భాగమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విరామం తీసుకున్నాడు. 

తాజాగా త్రివిక్రమ్ తన కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. ఆయన భార్య సౌజన్య, వారి కుమారులు రిషి, నీరజ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
దర్శనం అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ చూడ ముచ్చటగా వుందని చూసినవారంతా అనుకున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీతో బయట ఎక్కడా కనిపించని త్రివిక్రమ్.. తాజాగా వెంకన్న దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు  ఎంత ఎదిగిపోయారో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇద్దరు కుమారులు హీరోల్లా వున్నారని.. త్వరలో వారు కూడా సినీ అరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ వస్తోంది.