1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tuk Tuk Chitravahini RYG banner Harsha Roshan Karthikeya Dev Steven Madhu, Sanvi Meghna

చిత్రవాహిని, ఆర్ వై జి బ్యానర్‌ ల సరి కొత్త టైటిల్ టుక్ టుక్

tuktuk poster
tuktuk poster
హర్ష రోషన్, కార్తికేయ దేవ్,  స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి నటించిన చిత్రం "టుక్ టుక్". చిత్రవాహిని, ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ "టుక్ టుక్" టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.
 
చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, "టుక్ టుక్" ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.
 
పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి.  రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించిన "టుక్ టుక్" క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
తర్వాతి కథనం
శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం ప్రకటన