శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:09 IST)

సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్య... చేతి నరాలు కట్ చేసుకుని..?

adithya
మలయాళ టీవీ ఇండస్ట్రీలో ప్రముఖ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు పాల్పడటం మలయాళ టీవీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈయన ఆదివారం సాయంత్రం కారు కూర్చొని తన చేతి మణికట్టు నరాలు కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా రక్తం పోవడంతో అపస్మారక స్థితిలో వెళ్లడంతో ఈ ఘటనను చూసిన కొందరు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని త్రిసూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. 
 
డాక్టర్లు ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదిత్య జయన్ తన చేతి నరాలు కట్ చేసుకునే ముందు అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమంత విషమంగానే ఉన్నట్టు సమాచారం. ప్రముఖ టీవీ నటుడు ఆదిత్య జయన్ భార్య కూడా అంబిలి దేవి కూడా ప్రముఖ నటి. 
 
ఈమె రీసెంట్‌గా తన భర్త పై తనను దారుణంగా మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఆమె మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు తన భర్త తనకు విడాకులు ఇవ్వాలంటూ బలవంత పెడుతున్నట్టు వెల్లడించింది.
 
అంతేకాదు ఈ సందర్భంగా తన భర్త విడాకులు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఆదిత్య జయన్ తన భార్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కొట్టిపారేశారు.
 
ఇక వీళ్లిద్దరు టీవీలో 'సీత' అనే సీరియల్‌లో భార్యభర్తలుగా నటించారు. అదే టైమ్‌లో వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీళ్లిద్దరు 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అర్జున్ అనే అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతం ఆదిత్య 'సీతా కల్యాణం', 'ఎంటె మాతవు' అనే సీరియల్స్‌లో నటిస్తున్నారు.