శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (19:36 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్. కోసం రెండు డేట్స్ ఫిక్స్ చేశారు

RRR date poster
రాజ‌మౌళి త‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమాను ఈ సంక్రాంతికి విడుద‌ల‌చేయ‌లేక‌పోయారు. దేశ‌మంతా క‌రోనా మూడో వేవ్ వ్యాపించిన సంద‌ర్భంగా ప‌లు రాష్ట్రాల‌లో థియేట‌ర్ల మూసివేయ‌డంతో త‌దుప‌రి తేదీని నిర్ణ‌యిస్తామ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. అందుకే తాజాగా శుక్ర‌వారం సాయంత్రం రెండు తేదీల‌ను చిత్ర నిర్మాత డివివి దాన‌య్య ప్ర‌క‌టించారు.
 
దేశంలో మహమ్మారి పరిస్థితి మెరుగుపడి, అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తెరిస్తే, ఆఱ్‌.ఆర్‌.ఆర్‌. చిత్రాన్ని 18 మార్చి 2022న విడుదల కానుంది.
లేకుంటే, 28 ఏప్రిల్ 2022న విడుదల అవుతుందని అందుతో స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే రాధేశ్యామ్, స‌ర్కారివారి పాట కూడా వాయిదా వేశారు. మ‌రి ఆ రెండు సినిమాలు కూడా త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ఫిక్స్ చేయ‌నున్నారు. ఒకేనెల‌లో మూడు సినిమాలు విడుద‌ల చేస్తే చిన్న సినిమాల‌న్నీ కొద్దిరోజులపాటు వాయిదాప‌డ‌నున్నాయి.