టీవీ శాటిలైట్ అమ్మకం... త్వరలో బుల్లితెరపై వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ వల్ల సరికొత్త రికార్డులను క్రియేట్ చేయలేకపోయంది. దీంతో ఈ చిత్రం విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇపుడు ఈ సినిమా టీవీలో ప్రసారం కానుంది.
'వకీల్ సాబ్' శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేయగా అతి త్వరలో ఈ సినిమాను టెలీకాస్ట్ చేయనున్నట్టు ఛానల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఛానల్ నిర్వాహకులు డేట్ గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ జులై 11వ తేదీ లేదా జులై 18వ తేదీన ఈ సినిమా ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ అయ్యాయి. వకీల్ సాబ్ బుల్లితెరపై ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.