బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (18:47 IST)

కత్తిమహేష్ మృతి.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ స్పందన ఏంటంటే?

kathi Mahesh_Pawan
ప్రముఖ సినీ విమర్శకుడు, దర్శక, నటుడు కత్తిమహేష్ మృతి చెందడంతో టాలీవుడ్ షాకైంది. సినీ విమర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన కత్తి మహేష్, సినిమా రివ్యూల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రివ్యూ విషయంలో పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంటుగా సైతం కత్తి మహేష్ తొలి సీజన్‌లో అలరించాడు. 
 
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ద్వారా కత్తి మహేష్ చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత టెలివిజన్ న్యూస్ డిబేట్స్ ద్వారా కూడా కత్తి మహేష్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగింది. ఇదిలా ఉంటే కత్తి మహేష్ మృతి పట్ల అటు పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన ఆసక్తిగా మారింది. అంతేకాదు కత్తి మహేష్ ఆక్సిడెంట్ సందర్భంగా కూడా పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుంది అని అటు నెటిజన్లు ఆరాతీశారు. 
 
ఆ సమయంలో పవన్ అభిమానులు చాలా హుందాగా ప్రవర్తించారని, కత్తి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలోనూ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫేస్‌బుక్ పేజీల్లో ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం కత్తి మహేష్ మృతి తర్వాత కూడా పవన్ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థన చేయడం గమనించవచ్చు.