శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (07:12 IST)

ఓరి దేవుడాలో దేవుడు పాత్ర‌లోవెంక‌టేష్

venky-viswak
venky-viswak
హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ స్ట‌న్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీక‌రించారు.
 
ఈ ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచింది. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. వెంక‌టేష్ కూల్‌, స్టైలిష్ లుక్ క‌న‌ప‌డే దేవుడు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. చుట్టూ పుస్త‌కాలు.. సీతాకోక చిలుక‌లు మ‌ధ్య విశ్వ‌క్ సేన్ క‌నిపించారు. విక్ట‌రీ వెంక‌టేష్ అంటే ఓ మేన‌రిజ‌మ్ ఉంటుంది. ఆ మేన‌రిజ‌మ్‌తో ఆయ‌న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు గ్లింప్స్ చివ‌ర‌లో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.
 
ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టం డ‌బుల్ స‌ర్‌ప్రైజ్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.  పివిపి సినిమా బ్యాన‌ర్స్‌పై ప్ర‌సాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 ఓరి దేవుడా’ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. విజ‌య్ ఈ చిత్రాన్ని ఎడిట‌ర్‌గా, విదు అయ్య‌న్న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.