సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (16:28 IST)

అయ్యోపాపం... కాజోల్ అలా కాలుజారి పడిపోయింది.. (వీడియో)

బాలీవుడ్ అందాల రాశి.. సీనియర్ నటి కాజోల్ ముంబైలోని ఓ మాల్‌లో కాలుజారి కిందపడిపోయింది. అయితే బాడీగార్డ్ సాయం అందించడంతో గాయాలు లేకుండా తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో

బాలీవుడ్ అందాల రాశి.. సీనియర్ నటి కాజోల్ ముంబైలోని ఓ మాల్‌లో కాలుజారి కిందపడిపోయింది. అయితే బాడీగార్డ్ సాయం అందించడంతో గాయాలు లేకుండా తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన నటికి ఏమైందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. 
 
గతంలో 2015లో దిల్ వాలే సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ కాజోల్ ఇదే విధంగా కాలుజారి పడిపోతున్న క్రమంలో సహ నటుడు వరుణ్ ధావన్ రెండు చేతులతో పట్టుకుని కాపాడాడు. ఆ సమయంలో కాజోల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తాజాగా ఇదే తరహాలో కాజోల్ ఓ మాల్‌లో పడిపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్లో హెల్త్ అండ్ గ్లో స్టోర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తెల్లటి డ్రెస్‌తో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఎస్కలేటర్ దిగి ఫ్లోర్‌లో నడుస్తుండగా, మరొక మహిళతో మాట్లాడుతూ.. కాజోల్ వెనక్కి పడిపోయింది. కానీ బాడ్ గార్డ్ సాయంతో ఆమె తిరిగి పైకి లేచింది.