బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:53 IST)

నేను కాలేజీలోనే సమంత ప్రేమలో పడ్డాను.. విజయ్ దేవరకొండ

Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత యశోద ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ యశోదపై కామెంట్లు చేశారు. ఈ మేరకు విజయ్ యశోద ట్రైలర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 
 
విజయ్ సమంతని ఉద్దేశించి మాట్లాడుతూ.. "నేను కాలేజీ చదువుకునే రోజుల్లో సమంతని మొట్టమొదటిసారి స్క్రీన్ మీద చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. తను సాధించిన వాటిని చూసి నేను ఇప్పటికి సమంతని ఆరాధిస్తాను"అని ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం విజయ్, సమంత కలిసి ఖుషి సినిమా కూడా చేస్తున్నారు.