బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (11:03 IST)

అల‌నాటి హరనాథ్ వార‌సుడు విరాట్ రాజ్ హీరోగా -సీతామనోహర శ్రీరాఘవ చిత్రం

Virat Raj
వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు విరాట్ రాజ్. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్. బుధ‌వారం నాడు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ విడుదల చేసి ఆశీస్సులు అందించారు. చిత్రం పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'. 
 
విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను  పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్ మరో ప్రచార చిత్రంలో గన్ చేతబట్టి యాక్షన్ లుక్‌లో క‌నిపించారు. ఇక‌ వెంకట సుబ్బరాజు గారు 'భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి' వంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు విరాట్ రాజ్‌.
 
దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ, ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను 'విరాట్ రాజ్' స్వంతం చేసుకునేలా కథను సిద్ధం చేయటం జరిగింది. టైటిల్‌ పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు. ఇక‌ కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న 'రవి బస్ రుర్' ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 
చిత్ర నిర్మాత సుధాకర్.టి తెలుపుతూ,  సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నది మరోసారి ప్రకటించటం జరుగుతుందని అన్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: జి.యం.శాస్త్రి; యాక్షన్: వెంకట్;
నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె. బ్యానర్: వందన మూవీస్