శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (10:08 IST)

డూప్ లేకుండా ఫైట్ సీన్ చేయబోయి కాళ్లూ చేతులు విరగ్గొట్టుకున్న హీరో

కొంతమంది హీరోలు తాము నటించే చిత్రాల్లోని కొన్ని ఫైట్ సీన్లను డూప్ లేకుండా నటించేందుకు ప్రయత్నింటారు. అలాచేసే క్రమంలో వారు ప్రమాదానికిగురై గాయాలబారిన పడుతుంటారు. తాజాగా తమిళ హీరో విశాల్ పరిస్థితి ఇలానే తయారైంది. తన కొత్త చిత్రంలో డూప్ లేకుండా చేయబోయి కాళ్లూ చేతులు విరగ్గొట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన టర్కీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం విశాల్ - తమన్నా జంటగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ఓ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్న వేళ, విశాల్ కాలు, చేయి విరిగింది. కాలికి, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో బయటకు వచ్చి, అభిమానులను కలవరపెడుతోంది. ఈ ఫైట్ సీన్‌ను డూప్ లేకుండా చేస్తుండగా, విశాల్ ప్రమాదానికి గురై గాయపడినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. 
 
కాగా, గతంలో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడిది వారిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్‌ను 50 రోజుల పాటు టర్కీలో జరపాలని యూనిట్ ప్లాన్ చేసింది. తాజాగా, విశాల్‌కు ప్రమాదంతో ఆయన షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో 'తుప్పరివాలన్' సినిమా షూటింగ్‌లోనూ విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే.