శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (15:29 IST)

లోకనాయకుడి "విశ్వరూపం-2" రిలీజ్ వాయిదా?

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విశ్వరూపం-2. ఈ చిత్రం ఈనెల 10వ తేదీన విడుదలకానుంది. అయితే, డీఎంకే అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మంగళవారం చనిపోయారు.

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విశ్వరూపం-2. ఈ చిత్రం ఈనెల 10వ తేదీన విడుదలకానుంది. అయితే, డీఎంకే అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మంగళవారం చనిపోయారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. దీంతో విశ్వరూపం చిత్రం విడుదల వాయిదాపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
స్థానిక ప్రభుత్వ ఎస్టేట్‌లోని రాజాజీ హాల్‌లో కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్‌ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కరుణతో కమల్ హాసన్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. 
 
ఈ కారణంగా ఈ చిత్ర విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసి ఆగష్టు 15వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్‌ ఉన్నట్లు సమాచారం. రిలీజ్‌ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్‌ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌తోపాటు, ఆస్కార్‌ ఫిలింస్‌ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించిన విషయం తెల్సిందే.