మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:44 IST)

సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!!

sanjay dutt
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఓ మహిళా వీరాభిమాని రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తిని రాసిచ్చింది. ఆ మహిళా వీరాభిమాని పేరు నిషా పాటిల్ (62). ఇటీవలే ఆమె చనిపోయారు. 2018లోనే సంజయ్ దత్ పేరిట వీలునామా రాయించింది. అయితే, ఆ ఆస్తిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్తిని స్వీకరించేందుకు నిరాకరించారు. అయితే, ఆ అభిమాని ప్రేమకు ఈ ఖల్‌ నాయక్ చలించిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన నిషా పాటిల్‌కు బావీవుడ్ హీరో సంజయ్ దత్ విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తుంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 యేళ్లు. కాగా, ఆమె పేరిట దాదాపు రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. 
 
తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని విషయాన్ని గ్రహించిన నిషా పటేల్.. 2018లోనే తన ఆస్తి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు సంజయ్ దత్‌కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్‌ ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన సంజయ్ దత్‌ షాక్ గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. 
 
అయితే, ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్‌కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు.