శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 7 మే 2020 (21:53 IST)

46 యేళ్ళ అందాల తారకు ఇంకా పెళ్ళి కాలేదు, ఎవరు?

సితార.. ఈమె మన తెలుగు అమ్మాయే అనుకున్న ప్రేక్షకులు లేకపోలేరు. కానీ సితార కేరళకు చెందిన తార. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాల్లో చేయకపోయినా సితారకు తెలుగు సినీపరిశ్రమలో మాత్రం మంచి పేరే ఉంది. తెలుగులో కాదు కన్నడ, మళయాళం, తమిళ సినిమాల్లో ఆమె నటించింది అందరినీ మెప్పించింది.
 
మొదటగా ఆమె నటించిన భాష తమిళం. తమిళ సినీపరిశ్రమలో అరంగేట్రం చేసి సుమారుగా ఐదు భాషల్లో నటించి ఆ భాషలను పూర్తిగా నేర్చేసుకుంది. అస్సలు ఆమెకు డబ్బింగ్ ఎవరు కూడా చెప్పరు. స్నేహం కోసం సినిమాలో ఎమోషనల్‌గా నటించి అందరినీ మెప్పించింది. భలేభలే మగాడివోయ్ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసింది. 
 
అమ్మ, అత్త, అక్క పాత్రలతో సితార బాగా అందరినీ మెప్పిచింది. అయితే ఈమధ్య లాక్ డౌన్ సమయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సితార. తనకు ఇంకా పెళ్ళి కాలేదని చెప్పుకొచ్చారు. తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని.. సినీరంగంలోకి వెళ్ళడానికి ఆయన ప్రోత్సాహమే ప్రధానమని చెబుతోంది.
 
అయితే ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో చాలా బాధపడ్డానని.. కొన్నిరోజుల పాటు సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటూ వచ్చానని చెబుతోంది సితార. కానీ ఆ తరువాత పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన తనకు రాలేదని.. ప్రస్తుతం 46 సంవత్సరాల వయస్సులో ఉన్నానని చెబుతోంది. తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన అస్సలు లేదంటోంది సితార.