సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం

గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) & సేవ్ టెంపుల్స్.ఆర్గ్, USA సంయుక్త ఆధ్వర్యంలో 1 అక్టోబర్ 2016 మధ్యాహ్నం 3 గం నుండి రాత్రి 8 గంటల వరకు ప్రసాద్ లాబ్స్, బంజారా హిల్స్, హైదరాబాద్‌లో ఈ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రచార

Ghajal Srinivas
ivr| Last Modified గురువారం, 29 సెప్టెంబరు 2016 (22:31 IST)
గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) & సేవ్ టెంపుల్స్.ఆర్గ్, USA సంయుక్త ఆధ్వర్యంలో 1 అక్టోబర్ 2016 మధ్యాహ్నం 3 గం నుండి రాత్రి 8 గంటల వరకు ప్రసాద్ లాబ్స్, బంజారా హిల్స్, హైదరాబాద్‌లో ఈ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రచార సారథి డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ఈ చిత్రోత్సవంలో మొదటి బహుమతి మరియు లక్ష రూపాయల నగదు బహుమతి పొందిన నాగసాయి మక్కం నిర్మించి, దర్శకత్వం వహించిన "కురుమూర్తి రాయ", ద్వితీయ బహుమతి మరియు డెబ్భై ఐదు వేల రూపాయల నగదు బహుమతి పొందిన కొత్తపల్లి సీతారాం నిర్మించి, దర్శకత్వం వహించిన "మహేంద్ర గిరి", తృతీయ బహుమతి మరియు యాభై వేల రూపాయల నగదు బహుమతి పొందిన సత్య ప్రసాద్ దర్శకత్వం వహించగా హరీష నిర్మించన "మనుషులు చేసినదేవుడు" మరియు కన్సోలేషన్ బహుమతి మరియు పది వేల రూపాయల నగదు బహుమతి పొందిన అవినాష్ కుమార్ నిర్మించి, దర్శకత్వం వహించిన "కొలిమిగుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి", బాను ప్రకాష్ మలిగి దర్శకత్వం వహించగా రమాదేవి నిర్మించిన "మా ఊరి దేవుడు అందరివాడు", మానస దర్శకత్వం వహించగా రమ్య రామానుజుల నిర్మించిన "మన వైభవం" డాక్యూమెంటరీలు ప్రదర్శించనున్నట్లు, అలాగే ప్రత్యేక స్క్రీనింగ్ విభాగంలో ఎంపికైన మరో నాలుగు డాక్యూమెంటరీలు ప్రదర్శించబడతాయని తెలిపారు.

ఈ డాక్యూమెంటరీ చలన చిత్రోత్సవాలకు జ్యూరీ మెంబర్స్‌గా ప్రఖ్యాత చలన చిత్ర దర్శకులు "లక్ష్మణ రేఖ" శ్రీ గోపాల కృష్ణ, ప్రముఖ సినీ, రంగస్థల నట శిక్షకులు శ్రీ దీక్షిత్ డి. ఎస్ మరియు ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సిరాశ్రీలు ఉన్నారని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవానికి శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, APERC చైర్మన్ జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, పూజ్య బ్రహ్మకుమారి మంజు బహెన్, BJP జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పి మురళిధరరావు, ఫార్మర్ డీజీపీ శ్రీ అరవింద రావు, శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాధ్, శ్రీ జి కిషన్ రెడ్డి, శ్రీ చింతల రామచంద్ర రెడ్డి, శ్రీ NVS
ప్రభాకర్ రావు, శ్రీ ఎన్ ఇంద్రసేనా రెడ్డి, శ్రీ టి రాజాసింగ్, MLC డా. రామచంద్ర రావు, BJP తెలంగాణ అధ్యక్షులు శ్రీ వి లక్ష్మణ్, BJP ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి శ్రీ సుధీష్ రాంభొట్ల, BJP నాయకులు (న్యూ ఢిల్లీ) శ్రీ పి రఘురాం, VHP ఉప-అధ్యక్షులు శ్రీ ఓబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర రావు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ శ్రీమతి వై వి అనురాధ, IAS, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు
తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.దీనిపై మరింత చదవండి :