శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శనివారం, 10 ఫిబ్రవరి 2018 (20:56 IST)

పిల్లిని నేను పెంచాను, ఎలుకను మా ఆవిడ పెంచింది... అంతే

తల్లి : నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఏ సబ్జెక్టులోనైనా తొంబైకి పైగా మార్కులొచ్చేవి తెలుసా? కూతురు : ఫేస్ బుక్ లేదు, వాట్సప్ లేదు. బోరు కొట్టి దిక్కు తోచక చచ్చినట్లు చదివి వుంటావు. మార్కులు రాక చస్తాయా... దానికే ఇంత బిల్డప్పా? 2 రాజు : ఏవండి మూర్తి గార

తల్లి : నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఏ సబ్జెక్టులోనైనా తొంబైకి పైగా మార్కులొచ్చేవి తెలుసా?
 
కూతురు : ఫేస్ బుక్ లేదు, వాట్సప్ లేదు. బోరు కొట్టి దిక్కు తోచక చచ్చినట్లు చదివి వుంటావు. మార్కులు రాక చస్తాయా... దానికే ఇంత బిల్డప్పా?
 
2
రాజు : ఏవండి మూర్తి గారు...మీ ఇంట్లో విచిత్రంగా ఎలుకని చూసి పిల్లి భయపడి పరిగెడుతున్నది ఏంటి?
మూర్తి : పిల్లిని నేను పెంచాను. ఎలుకని మా ఆవిడ పెంచింది... అంతే.
 
3
ఒక దొంగ దొంగతనం చేసి వెళ్ళే సమయంలో..... ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అంటాడు. మర్యాదగా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు... లేదంటే అరచి గోల చేస్తా.