మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (12:12 IST)

గ్రామీణ కులవివక్షత, ఐక్యతకు నిదర్శనం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు - రివ్యూ

Ambajipet marriage band
Ambajipet marriage band
నటీనటులు: సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్, సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్, నిర్మాతలు: ధీరజ్ మోగిలినేని, దర్శకుడు : దుశ్యంత్‌ కటికినేని, విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024
 
కలర్ ఫొటోతో హీరోగా, హిట్-2 లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్ తాజాగా  “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు” సినిమాలో నటించాడు. శివాని నాగారం హీరోయిన్ గా పరిచయం అయింది. దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రంకాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 కోనసీమలోని అంబాజీపేట అనే గ్రామంలో మల్లి (సుహాస్) మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటుంది.  తండ్రి వ్రుత్తిరీత్యా బార్బర్. ఊరిలో చిన్న షాప్. ఆ ఊరి పెద్ద వెంకట్ (నితిన్ ప్రసన్న) జనాలపై పెత్తందారి చేస్తుంటాడు. గ్రామంలో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే గ్రామంలో వెంకట్ వల్లే పద్మకి స్కూల్ టీచర్గా  వుద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఇందుకుగాను పద్మను తన మిల్లుకు సంబంధించిన లెక్కలు రాయమని ఒప్పిస్తాడు.
ఇదిలా వుండగా, వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ)తో మల్లి ప్రేమలో పడతాడు. శివాని కూడా మల్లిని ప్రేమిస్తోంది. ఇది తెలుసుకున్న వెంకట్ ఏమి చేశాడు? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు మల్లి జీవితంలో సంభవించాయి? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
సహంజగా గ్రామాల్లో ఇప్పటికీ కింది కులాలపై అగ్రకుమాలు పెత్తందారీ తనం, కుల వివక్ష అనేవి వుంటూనే వున్నాయి. 1980 లో మరీనూ. క్షవరం చేసుకు వ్రుత్తి అంటే మరింత చులనకగా చూస్తుంటారు. అలాంటి కులానికి చెందిన మల్లి జీవితమే ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా.  కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది అని ముందుగానే దర్శకుడు ప్రకటించారు. ఆయన చూసిన సంఘటనలు సినిమాగా తీశాడని కూడా చెప్పారు.
 
సహజంగా క్షురకర్మ లు చేసే వారు యూనిటీగా వుండడం అరుదైన విషయం. ఆ ఊరిలో వున్న వారంతా ఏకమవడం ఈ చిత్రంలో ప్లస్ పాయింట్. కథానుగుణంగా కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల మనోభావాలను ఆవిష్కరించే చిత్రం ఇది.
 
అక్క, తమ్ముడు మధ్య వచ్చే సన్నివేశాలు మనస్లాసుకు హత్తుకునేలా వుంటాయి. పద్మ, మల్లి పాత్రలకు – వెంకట్ పాత్రకు మధ్య మొదలైన వైరం.. ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ కథ కొత్త మలుపు తీసుకోవడం, చివరకు వెంకట్ పరిస్థితి ఊహించని విధంగా మారిపోవడం. సుహాస్ నటన సహజంగా వుంది. బ్యాండ్ వాయించే వ్యక్తిగా తను లీనమైపోయాడు. బ్యాండ్ ఎపిసోడ్ కానీ, ఊరిలో కుల వివక్షగానీ తమిళం, మలయాళ నేటివికీ కూడా కనెక్ట్ అయ్యేవిధంగా వున్నాయి. సుహాస్ తల్లిగా శరణ్య ప్రదీప్ కూడా చాలా బాగా నటించింది. నితిన్ ప్రసన్న పాత్ర మాత్రం ఈ సినిమాకి ప్రత్యేకం. హీరోయిన్ గా శివాని నాగరం బాగా అలరించింది. అలాగే, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు పాత్రలకు న్యాయం చేశారు.
 
ఈ చిత్ర కథ. పల్లె మనుషుల కథ. అందుకే ఇప్పటికి అనుగుణంగా కమర్షియల్ అంశాలు పెద్దగా కనిపించవు. స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన ఎలిమెంట్స్ కూడా ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది,అనేది క్రియేట్ చేయడంలో కొంచెం మైనస్ అనే చెప్పాలి.
 
దుశ్యంత్‌ కటికినేని రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం కథకు తగినట్లుగా వుంది. సినిమాటోగ్రఫీ  ఆకర్షణగా నిలుస్తోంది.ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత ధీరజ్ మోగిలినేనిను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. నిమ్న కులం వాడు అగ్ర కులం వారిని ప్రేమిస్తే పరిణామాలు ఎలా వుంటాయనేది చాలా కథల్లో చూశాం. ఆ తరహాలో కథే అయినా పరిస్థితులను బట్టి ఒకరికొకరు త్యాగాలు చేసుకోవడం. ఊరి పెద్దకు విధించే శిక్ష వినూత్నంగా వుంది కథకు బలాన్ని చేకూర్చించింది.
 రేటింగ్ :3/5