శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (10:25 IST)

సరిపోదా శనివారంలో నాని, ఎస్. జె. సూర్య లదే హైలైట్ సింపుల్ రివ్యూ

Nani saripoda
Nani saripoda
నాని, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన సినిమా సరిపోదా శనివారం నేడు తెల్లవారు జామున 6గంటలకే విడుదలైంది. ఓవర్ సీస్ లో ముందుగానే విడుదలయింది. ఇందులో నాని చేసిన పెర్ పార్మెన్స్ కు సూర్య నటన తోడై నువ్వా నేను అన్నట్లు వుంటుందని విడుదలకు ముందే చెబుతున్నారు. 
 
కథగా చెప్పాలంటే.. సోకులపాలెం అనే ఊరిలో నాని చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన జీవితాన్ని మార్చివేస్తుంది. అతనికి కోపం ఎక్కువ. అందుకే చుట్టుపక్కలవారి బాధ భరించలేక శనివారం ఒక రోజు కోపం గురించి కండిషన్ పెడుతుంది. పెద్దయ్యాక ఎల్. ఐ. సి. ఏజెంట్ పని చేస్తుంటా నాని. కానీ డ్యూటీలో వుండగా పలు సార్లు కోపం వచ్చినా తమాయించుకుంటాడు. అదే ఊరిలో ప్రియాంక కానిస్టేబుల్ గా వస్తుంది. సూర్య సి. ఐ.గా నటించాడు. అతనికి ఎప్పుడూ  కోపమే. చిన్న విషయానికి ఫైర్ అయిపోతుంటాడు. అలాంటిది శనివారం నాడే కోపం వుండే నానితో చిన్న రగడ జరుగుతుంది. ఆ సందర్భంగాా కథ ఎటువైపు మలుపు తిరిగింది. అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
 
ఈ సినిమా ప్రతీ పాత్ర ఐడెంటిఫై అయ్యేట్లుగా వున్నాయి. నాని, సూర్య పాత్రలయితే సీరియస్ తోకూడి ఎంటర్ టైన్ మెంట్ గా వుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ యూత్ కనెక్ట్ అవుతారు.  
 
హీరో తల్లి పాత్రలో అభిరామి కనిపించింది. వారిమధ్య, సోదరి అదితి బాలన్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ కథను ముందుకు తీసుకెళతాయి. నాకికి కోెపంతోొ వస్తే రక్షా కవచంలా చేతికి ఎరుపురంగు కట్టుకుంటాడు. అజయ్ ఘోష్ గ్యాంగ్‌తో ఓ మాస్ ఫైట్‌ వినోదంగా వుంటుంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ చారులత అనే ఓ సాధారణ పోలీస్ పాత్రలో పరిచయం అయ్యింది. అయితే ప్రియాంక మోహన్ పాత్రకి సంబంధించి ఓ చిన్న ట్విస్ట్ తోనే ‘సోకులపాలెం కథ రన్ అవుతుంది.
 
సినిమా ప్రథమార్థం సింపుల్ కథతో సాగింది. ఎస్.జె.సూర్య మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలవగా, నాని తన పాత్రలో మెప్పించాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ చిత్రానికి కావాల్సిన కమర్షియల్ హంగులు కాస్త తక్కువ అయ్యాయని అనిపిస్తుంది. నాలుగు విభిన్నమైన అంశాలు ‘శనివారం’పై ఆసక్తిని పెంచేస్తాయి. మురళీశర్మ-సూర్యల అంశం ఓ వినూత్నమైన మలుపు తీసుకుంటుంది. ఫ్లాష్‌బాక్ ముగియడంతో సోకులపాలంలో ఓ భారీ ఎమోషనల్ క్లైమాక్స్ చోటుచేసుకోనుంది.
 
సంగీతపరంగా, కెమెరా పనివిధానం బాగుంది. యాక్షన్ సీన్స్ లో కొంత ఎడింటి్ మెరుగ్గా వుంటే బాగుండేది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారి మాస్ తరహా అంశాలతో నానిపై ప్రయోగం చేశాడనే చెప్పాలి. తన కొత్త మార్క్ చూపించాడు. టోటల్ గా చూస్తే నాని సినిమా కెరీర్ కు మరో మంచి సినిమా అవుతుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల లాగ్ లున్నా అవి పెద్దగా కనిపించకుండా దర్శకుడు కేర్ తీసుకున్నాడు. మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్న నానికి ఈ సినిమా ప్రేక్షదారణ బట్టి రేంజ్ ఏమిటో తెలుస్తుంది. 
రేటింగ్ : 3/5