త్రినాథరావు నక్కిన మార్క్ వినోదంగా మజాకా చిత్రం - మజాకా రివ్యూ
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు, మురళీశర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు.
సాంకేతికత: కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాయికృష్ణ; సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ; నిర్మాణం: రాజేశ్ దండ; దర్శకత్వం: త్రినాథరావు నక్కిన. సందీప్‌కిషన్ 30వ సినిమా మజాకా. ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం చేసారు. శివరాత్రి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి చిత్రం ఎలా ఉంది? తెలుసుకుందాం.
కథ:
వెంకటరమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. వెంకటరమణకు భార్య లేదు. అందుకే కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాలనేది వెంకటరమణ ఆరాటపడుతుంటాడు. ఆ క్రమంలో కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్ళిన చోటల్లా ఆడదిక్కులేని ఇంట్లో ఇవ్వమని తెల్చిచేపుతారు. దానితో ఓ మిత్రుడి సలహాతో వెంకటరమణ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక యశోద (అన్షు)కు వెంకటరమణ అంటే ఇష్టం. అతని కోసమే ఉన్న యశోద పెళ్ళికి గ్రీన్సిగ్నల్ ఇస్తుంది. మరోవైపు వెంకటరమణ కొడుకు మీరా (రీతూవర్మ) ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఇద్దరి ప్రేమలు గురించి ఒకరికి ఒకరు తెలుసుకుంటారు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవాలని చూస్తారు. టైంలోభార్గవ్ వర్మ (మురళీశర్మ) వీరి కి అద్దుపడతాడు. ఎందుకు? ఏమిటి? ఎల్లా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాలు ప్రేమ కథల్లో కించెం ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. మేము వయస్సుకు వచ్చాం నుంచి అలాగే ఉంటాయి. ఇక మజాకలో కూడా రాత్రిళ్లు తండ్రీ కొడుకులు పోటీపడి ప్రేమలేఖలు రాసుకోవడం, ఇద్దరూ తాము మనసిచ్చినవాళ్ల కోసం గోడలు దూకడం, బస్సుల్లో ఫాలో కావడం వంటి చీప్ ట్రిక్ లు ఇబ్బందిగా అనిపిస్తాయి. రచయిత ప్రసన్న కథకు లాజిక్ లేకుండా కేవలం నవ్వుకునేందుకు తెసిన సినిమా ఇది.
ఇలా సాగుతున్న కథనంలో మురళి శర్మ పాత్ర తో కూడా పగ, ప్రతీకారంతో రగిలే సన్నివేశాలము కూడా సరదాగా చూపించాడు. తర్వాత ఏమి జగుగుసుందో తెలిసిపోతుంది. ఇక ద్వితీయార్ధంలో భిన్నంగా కథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంచాడు దర్శకుడు. అక్కడ్నుంచి దాని చుట్టూనే సన్నివేశాలు తిరుగుతాయి. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ బోరింగా అనిపిస్తుంది. ఈ కథలో కామెడీనే కాదు, భావోద్వేగాలకీ చోటుంది. క్లైమాక్స్‌లోనే వాటిపై దృష్టిపెట్టారు. భావోద్వేగాల్ని కూడా సరిగ్గా ప్రసేంట్ చేయకపోవడంతో వాటిని కూడా వినోదంగా మార్చడంతో బలవంతంగా చెప్పినట్లుంది.
నటనాపరంగా, సందీప్‌కిషన్, రావు రమేష్ లు పాత్రలకు న్యాయం చేసారు. తండ్రీ కొడుకులుగా హుషారైన నటన మెప్పిస్తుంది. సందీప్‌కిషన్ పక్కింటి కుర్రాడి తరహా పాత్రలోనే కనిపిస్తాడు. కామెడీ పరంగా ఆయన టైమింగ్ బాగానే ఉంది. అలాగే మురళీశర్మ పాత్ర ఈ కథకు ప్రధానబలం. ఆయన బాగా చేసాడు. రీతూవర్మ, అన్షు, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది అక్కడక్కడా నవ్విస్తారు. వినోదంతో పాటలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. పాటల సందర్భమే అతకలేదు.
రాసుకున్న కతను సహజత్వం లోపంతో తన సినిమా ఫార్మేట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన తీసిన మజాకా టైం పాస్ సినిమా గా నిలుస్తుంది.
రేటింగ్ : 2.5/5