గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:06 IST)

"ఆశ" ఎన్‌కౌంటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం ఆశ. దేశ వ్యాప్తంగా సంతలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా చేసుకుని దిశ ఎన్‌కౌంటర్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 
అయితే, దిశ అత్యాచారం, హత్య కేసును సినిమా తీయనున్నట్లు ఆర్జీవీ ప్రకటన చేయగానే విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. 
 
గతంలోనే పోస్టర్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా టైటిల్‌ను చేంజ్ చేసి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు. అందులో నవంబర్ 26న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 
 
అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'ఆశ ఎన్‌కౌంటర్' అనే టైటిల్‌తో విడుదలైన ఈ ట్రైలర్‌లో వాస్తవంగా జరిగిన సంఘటనలనే చూపించాడు. ట్రైలర్ ఆరంభంలో ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు అంటూనే ప్రజలు టీవీలో చూసిన, తెలిసిన సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.