హాలీవుడ్ స్థాయిలో `భుజ్` యాక్షన్ ఎపిసోడ్స్- ట్రెమెండస్ రెస్పాన్స్
సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహీ, రానా దగ్గుబాటి, శరద్‌ఖేల్కర్ తదితరులు నటించిన బాలీవుడ్ మూవీ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేది శీర్షిక. 1971 భారత, పాకిస్థాన్ మధ్య జరిగియన యుద్ధం నేపథ్యంలో తెరకేక్కిన సినిమా. భుజ్ ప్రాంతంలో ఏం జరిగింది? అనేది కథాంశంతో ఆసక్తికరంగా తెరకెక్కింది. ఇందుకు నిదర్శనమే మంగళవారంనాడు విడుదలైన ట్రైలర్. ఈ ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో వున్నాయనే చెప్పాలి. దేశభక్తిని పెంచేవిధంగా డైలాగ్ లు వున్నాయి. ఇప్పటివరకు రాని సినిమాగా కనిపిస్తోంది. అయితే ఇది వెండితెరపై చూసేందుకు ఆస్కారం లేదు.
ఓటీటీ ఒరవడిగాలో భాగంగా ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ స్ట్రీమింగ్ ఆగస్టు 13న కానుంది. చిన్నతెరపైనే చూస్తే అలా అనిపిస్తే పెద్ద తెరపై మరింతగా హైలైట్ అవుతుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇందులో ప్రతిపాత్రా దేశభక్తిని పెంచేదిగా వున్నాయనే చెప్పాలి. ఇందులో మరింత హైలైట్ ఏమంటే, పాకిస్తాన్ దళాలు భుజ్ విమానాశ్రయంపై దాడి చేసిన తరువాత అతను ఒక పొరుగు గ్రామానికి చెందిన 300 మంది మహిళల సహాయంతో మొత్తం ఎయిర్ బేస్ ను ఎలా పునర్నిర్మించాడో ఈ చిత్రంలో హైలైట్ అని దర్శకుడు అభిషేక్ దుధయ్య తెలియజేస్తున్నాడు.