శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (11:58 IST)

అంతుచిక్కని అడవి శేషు 'గూఢచారి' (ట్రైలర్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం పంజా. ఈ చిత్రంలో అభిమానులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. కర్మ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం పంజా. ఈ చిత్రంలో అభిమానులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. కర్మ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి" చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. 'క్షణం' సినిమాతో నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు. 'దొంగాట', 'క్షణం', 'అమీతుమీ' వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇపుడు 'గూఢచారి'గా ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
 
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రను పోషించగా, శోభిత ధూలిపాళ్ల హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇపుడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైల‌ర్ హీరో నాని చేతుల మీదుగా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉండ‌డంతో పాటు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. కథ గురించి ట్రైలర్‌తో పెద్దగా క్లూ ఏమీ ఇవ్వకపోయినా థ్రిల్లింగ్ నెరేషన్‌ను మాత్రం శాంపుల్‌గా చూపించారు. ఆగ‌స్టు 3వ తేదీన సినిమా విడుద‌ల కానుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.