1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (10:48 IST)

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

Kannappa getup
Kannappa getup
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇటీవల జూన్ 14న కన్నప్ప సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
కన్నప్ప టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరించింది. యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. కన్నప్ప టీజర్ ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో కూడా విడుదల చేశారు. 
 
ఇప్పటికే కన్నప్ప చిత్రం టీజర్ కేవలం తెలుగులోనే 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించి దూసుకుపోతుంది. అలాగే తాజాగా అన్ని భాషల్లోనూ కలిపి కన్నప్ప టీజర్ 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. ఇక కన్నప్ప  చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.