బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (16:40 IST)

నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణ సాయి : జ్యువెల్ థీఫ్ టీజర్ లో పృధ్వీ

Prithvi, Krishna Sai, Meenakshi Jaiswal
Prithvi, Krishna Sai, Meenakshi Jaiswal
కృష్ణసాయి,  మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'జ్యువెల్ థీఫ్' .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ... హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. నేను,  కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణ సాయి. అని చెప్పుకొచ్చారు.
 
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. 'జ్యువెల్ థీఫ్'  ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.
 
ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ... కృష్ణ సాయికి తగ్గ కథ ఇది. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.  
 
హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ : మంచి కాన్సెప్ట్ తో రూపోందిన 'జ్యువెల్ థీఫ్'  సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో నటించిన అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు అన్నారు.