మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By tj
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:09 IST)

వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం (video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ సేవ కన్నా ఈ యేడాది భక్తుల రద్దీ మరింత పెరిగింది. 
 
లక్షలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే గ్యాలరీలలో భక్తులు కూర్చుండిపోయారు. గోవిందా..గోవిందా అంటూ పెద్ద ఎత్తున స్వామివారి నామస్మరణలు చేశారు. మాఢావీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా జనమే. భక్తజన సంద్రంగా మారిపోయింది.
 
శ్రీవారి గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ సేవ కోసం టీటీడీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా 3,700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.