బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (11:32 IST)

కోరిందల్లా ప్రసాదించే కల్పవక్షవాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి... (Video)

తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చ

తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు.

కోరిందల్లా ప్రసాదించే కల్పవృక్షాన్ని ఆసనంగా చేసుకుని... సుందరంగా అలంకృతమైన మలయప్ప స్వామి.. దేవేరులతో మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఏడు కొండలు మారుమోగ్రాయి. 
 
అలాగే బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి (మంగళవారం) శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. సర్వభూపాల వాహనంలో రాజాధిరాజుగా భక్తుల యోగక్షేమాలను తెలుసుకునేలా మలయప్పస్వామి మంగళవారం రాత్రి తిరువీధుల్లో విహరించారు. భూమిని పాలించేవారు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలు వుంటాయి. అన్నింటిలోనూ భూమి వుంది.
 
నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలుడు.. ఇలాంటి భూపాలకులు బ్రహ్మోత్సవాలకు వస్తారు. శ్రీవారిని ప్రార్థిస్తారు. ఈ సేవ కోసం భూపాలకులందరూ శ్రీవారి వాహనంగా మారుతారు. అలా భూపాలకులందరి భుజస్కంధాలపై ఊరేగడమే సర్వభూపాల వాహన సేవ.

ఈ సర్వభూపాల వాహనాన్ని టీటీడీ కొత్తగా తయారుచేసింది. ఈ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఈ వాహన సేవలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.