మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:29 IST)

ముత్యాల పందిరిలో చూడముచ్చటగా ఊరేగిన మలయప్ప స్వామి.. (Video)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమల కొండలపై వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలో పోటీ పడుతూ విద్యుద్ధీపకాంతులతో తళుకులీనే ముత

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమల కొండలపై వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలో పోటీ పడుతూ విద్యుద్ధీపకాంతులతో తళుకులీనే ముత్యాలపందిరి వాహనంలో మలయప్పస్వామి ఊరేగారు.

సోమవారం రాత్రి ముచ్చటగా మాడవీధుల్లో ఊరేగారు. ముత్యాలతో అలంకృతమైన మలయప్ప స్వామి దేవేరులతో తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని వీక్షించేందుకు పోటీపడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగ్రాయి. 
 
ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అంతటి ప్రాశస్త్యమైన ముత్యాలను పందిరిగా చేసుకున్న వాహనంలో మలయప్ప స్వామి చూడముచ్చటగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఇక సోమవారం ఉదయం శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 
 
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యోగముద్రలో సింహవాహనంపై ఆసీనులై మలయప్ప ఊరేగారు.  బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం సింహవాహనంపై భక్తులకు స్వామివారు అభయమిచ్చారు.

పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు సింహం సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతువుతారు.