శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By PYR
Last Modified: బుధవారం, 7 జనవరి 2015 (05:09 IST)

సినీ నటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ పేలుడు..!

మంగళవారం రాత్రి సినీనటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. అయితే అది గ్యాస్ లైట్ కు సంబంధించిన సిలిండర్ కావడం, గ్యాస్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో సినిమా మిక్సింగ్ కు సంబంధించిన పరికరాలు, కొన్ని కంప్యూటర్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు ఇంట్లో ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నివారు చెప్పారు. ప్రాణ నష్టం ఏమి లేదని ఎవరికీ గాయాలు కూడా లేదని చెప్పారు.