శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 మే 2024 (11:48 IST)

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

570 stones in woman stomach
ఓ మహిళ కడుపులో 570 రాళ్లు వుండటం చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అంబేద్కర్ కోనసీన జిల్లా అమలాపురం లోని దేవగుప్తంకి చెందిన నరసవేణి అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. సమస్య వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఎలాగో నొప్పిని భరిస్తూ వస్తోంది. ఐతే ఈ కడుపు నొప్పి మరింత తీవ్రమై తట్టుకోలేని స్థాయికి వెళ్లడంతో ఆమె అమలాపురంలోని ఏఎస్ఎ ఆసుపత్రికి వెళ్లి సమస్యను చెప్పింది. వైద్యులు పరీక్షించి ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
 
వెంటనే ఆమెకి సర్జరీ చేయాలని నిర్ణయించారు వైద్యులు. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె కడుపులో వున్న రాళ్లను చూసి అంతా షాక్ తిన్నారు. రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 570 రాళ్లు ఆమె కడుపు నుంచి బయటపడ్డాయి. సహజంగా ఇలాంటి కేసుల్లో పదుల సంఖ్యలో మాత్రమే రాళ్లు వుంటాయనీ, అలాంటిది ఆమె పొట్టలో వందల సంఖ్యలో రాళ్లు వుండటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు.