ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (15:17 IST)

#BalochistanIsNotPakistan ట్రెండింగ్ నెం.1 అయ్యింది.. ఎందుకో తెలుసా?

#BalochistanIsNotPakistan అనే హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెలూచిస్థాన్ సాలిడారిటీ డేని ఆగస్టు 14న, 15 బ్లాక్‌గా జరుపుకోవాలని పాకిస్థాన్ పిలుపు నిచ్చింది. #BalochistanSolidarityDay #14AugustBlackDay ఈ క్రమంలో ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాయి. కానీ ప్రస్తుతం బలూచిస్థాన్ ఈజ్ నాట్ పాకిస్థాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ నెంబర్ వన్‌గా నిలిచింది. 
 
ఇందుకు కారణం లేకపోలేదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా ఐదు వేల మంది చిన్న పిల్లలు సహా సుమారు 20 వేల మందిని అత్యంత అమానుషంగా, కర్కశంగా పాకిస్థాన సైన్యం హతమార్చింది.

అందులో హిందువుల సంఖ్యే ఎక్కువ. బలూచిస్థానలో హిందువులనే లక్ష్యంగా చేసుకుని పాక్‌ సైన్యం క్రూరమైన చర్యలకు పాల్పడింది. ఇక అత్యాచారాలు, దోపిడీలకు అంతే లేదు. బలూచిస్థాన్‌లో జరిగే అమానుష కార్యకలాపాలు ప్రపంచంలో మరెక్కడా జరగవనిపిస్తుంటుంది.
 
ఈ నేపథ్యంలో కాశ్మీర్ సమస్యను మోదీ సర్కారు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో.. బలూచిస్థాన్‌ కూడా పాకిస్థాన్ ఇక ఉండకూడదనే విధంగా #BalochistanIsNotPakistan అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బలూచిస్థాన్ పాకిస్థాన్‌లో భాగం కాదని, బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కావాలని ఆందోళనలు మొదలైయ్యాయి. 
 
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని.. వేలాది మంది యువతను, చిన్నారులను పొట్టనబెట్టుకుందని, మహిళలపై అరాచకాలకు పాల్పడిందని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. త్వరలో బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆగడాలకు తెరపడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇకపోతే.. బలూచిస్థాన్ గురించి మోదీ 2016 స్వాతంత్య్రం రోజున ప్రస్తావించారు. అప్పుడు ఉలిక్కిపడిన పాకిస్థాన్ తమ అంతర్గత వ్యవహారమైన బలూచిస్థాన్ గురించి మోదీ స్వాతంత్య్రం రోజున ప్రస్తావించడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపింది. 
 
బలూచిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గితల గురించి మోదీ ప్రస్తావించడాన్ని బట్టి పాకిస్థాన్ విషయంలో మోదీ విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.


పాకిస్థాన్ గనుక కాశ్మీర్‌ వ్యవహారాల్లో కల్పించుకుంటే, ఆ దేశం బలూచిస్థాన్‌ను వదులుకోవాల్సి వస్తుందంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌ తరచూ హెచ్చరిస్తూనే వున్నారు. దీంతో బలూచిస్థాన్ విషయంలో మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.