శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (12:42 IST)

పాతాళ గంగ చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము (వీడియో)

snake
snake
శ్రీశైలంలోని పాతాళ గంగలో ఎప్పుడు చూసినా పచ్చగా కనిపిస్తుంది. ప్రతిసారీ ఎందుకిలా పచ్చగా వుందనే అనుమానం కలుగుతుంటుంది. శ్రీశైలం కొండకు సమీపంలో భూగర్భ మట్టం ఉన్నందున పాతాళ గంగ అని పేరు పెట్టారు. పాతాళ గంగలోని నీరు పవిత్ర జలంగా పరిగణించబడుతుంది. మరియు గంగానది నీటికి సమానంగా ఆధ్యాత్మికంగా పరిగణించబడుతుంది. 
 
శ్రీశైలం డ్యామ్‌కు సమీపంలో ఉన్న ఈ సరస్సు కృష్ణ, పెన్నా నది నుండి వస్తుంది. ప్రజలు బోటింగ్ కోసం వెళ్ళవచ్చు. రోప్ కార్ ద్వారా పాతాళ గంగ చేరుకుని సరస్సులో పుణ్యస్నానాలు చేసి, గంగాదేవిని పూజించవచ్చు. 
 
అలాంటి పలు విశేషాలను కలిగివున్న పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగాన్ని నాగుపాము చుట్టుకుంది. అచ్చం శివలింగానికి శేషుడు చుట్టుకుంటే ఎలా వుంటాడో అలానే నాగుపాము చంద్రలింగాన్ని దర్శించుకున్న భక్తులు.. ఇదంతా శుభసూచకమని భావిస్తున్నారు.