గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (16:02 IST)

పార్టీలో చేర్చుకుంటే స్టాలినే మా లీడర్ : ఎంకే అళగిరి

తనను పార్టీలో చేర్చుకుంటే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. అళగిరి వ్యాఖ్యానించారు. లేనిపక్షంలో తనపని తాను చేయాల్సి వస్తుంద

తనను పార్టీలో చేర్చుకుంటే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. అళగిరి వ్యాఖ్యానించారు. లేనిపక్షంలో తనపని తాను చేయాల్సి వస్తుందంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు.
 
కాగా, కరుణానిధి చనిపోయిన తర్వాత పార్టీ అధినేతగా స్టాలిన్ ఏకగ్రీవంగా డీఎంకే అధినేతగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తనను పార్టీలో చేర్చుకోకపోతే స్టాలిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు చేసిన అళగిరి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తనను పార్టీలో చేర్చుకుంటే.. స్టాలిన్ డీఎంకే అధినేతగా అంగీకరిస్తానని చెప్పారు. పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. స్టాలిన్‌ను లీడర్‌గా అంగీకరించడం తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను తన పెద్ద కుమారుడు అని కూడా చూడకుండా అళగిరిని 2014లో డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం విదితమే.