Exit polls: ఆ 5 రాష్ట్రాల్లో పాగా వేసేది ఎవరు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా గురువారం నాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎనిమిదవ మరియు చివరి దశ పోలింగ్ పూర్తయ్యింది. ఈ నేపధ్యంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరు గెలుస్తారన్న దానిపై మహా ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
పశ్చిమ బెంగాల్ (294 సీట్లు), అస్సాం (126 సీట్లు), తమిళనాడు (234 సీట్లు), కేరళ (140 సీట్లు), పుదుచ్చేరి (30 సీట్లు) ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌ను ఎవరు గెలుస్తారు? అస్సాం, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరిలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాం.