శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:43 IST)

వ్యాక్సిన్ భయం.. ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది..

సిక్కోలు ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది వ్యాక్సిన్ భయం. గురువారం పశ్చిమబెంగాల్‌లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జవాన్ రొక్కం తారకేశ్వరరావు. కోటబొమ్మాళి(మం) చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్ సిలిగూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ వేయించుకున్న తారకేశ్వరరావు ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 
 
తండ్రితో అనారోగ్యసమస్యను చెప్పుకుని బాధపడిన తారకేశ్వరరావు... అనారోగ్యం కారణంగానే గన్ తో కాల్చుకుని చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న తారకేశ్వరరావు ఫోటోలను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. అందరికి ధైర్యం చెప్పే తారకేశ్వరరావు సూసైడ్ చేసుకోవడంతో చౌదరికొత్తూరులో విషాధచాయలు అలుముకున్నాయి.