శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (12:58 IST)

పోక్సో చట్టంతో బాలురకు కూడా సవరణ : కేంద్రం యోచన

లైంగికదాడులకు గురవుతున్న బాలికలకు రక్షణ కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టంలో కీలక సవరణలు చేసింది.

లైంగికదాడులకు గురవుతున్న బాలికలకు రక్షణ కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టంలో కీలక సవరణలు చేసింది. ముఖ్యంగా, 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి ఉరిశిక్ష లేదా చనిపోయేంత వరకు జైలుశిక్ష విధించేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టగా, దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్రవేశారు.
 
ఈ నేపథ్యంలో బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. అందువల్ల త్వరలో ఈ చట్టానికి మరికొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.