గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (09:13 IST)

దేశంలో ఫస్ట్ టైమ్ - అయినా భయం లేదంటున్న వైద్య నిపుణులు..

Omicron subvariant BA.4
హైదరాబాద్ నగరంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గా దీన్ని గుర్తించారు. ఈ తరహా వైరస్ మన దేశంలో వెలుగు చూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 9వ తేదీన ఈ కేసు వెలుగు చూసినప్పటికీ ఒమిక్రాన్ అంత ప్రమాదకారికాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, ఈ సబ్ వేరియంట్ కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కానీ, ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఈ వేరియంట్ మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. అయితే, భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఏ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసులు పెరిగినా ఉధృత్తి మాత్రం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ బారినపడిన బాధితులు ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది.