సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (12:42 IST)

మాతృభాషను కాపాడుకోవాలి.. అమ్మభాషలో విద్యాబోధన.. ఒత్తిడి పరార్

మాతృభాషలను కాపాడుకోవాలనే విషయాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకు పైగా మాండలికాలున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు.  
 
కాగా.. ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషల ఉనికి ప్రమాదంలో పడిన నేపథ్యంలో.. మాతృభాష కోసం బెంగాల్ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి పునాది పడింది. 
 
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21న  నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ సభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో మాతృభాషా వికాసానికి ప్రభుత్వాలు నడుంబిగించాలని యునెస్కో పేర్కొంటోంది. అంతరించిపోతున్న భాషలను గుర్తించి కాపాడుకోవాలని సూచిస్తోంది. ఇంకా మాతృ భాషలో విద్యాభోదన పిల్లకు మానసిక ఒత్తిడి వుండదని కూడా పరిశోధనలు తెలిపాయి.