శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (18:06 IST)

అలా జరిగితే వైసీపీ ఖతం... పవన్ కాళ్లు పట్టుకుంటారు బాబు, విజయసాయిరెడ్డి ఆడియో నిజమా?

ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగుతాయని అనుకుంటుండగా వైసీపీ కీలక నేతగా పేరున్న విజయసాయిరెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో టేపు ఇపుడు మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో టేపులో వైసీపి విజయం అంత సులభం కాదంటూ ఆ స్వరం చెప్తోంది. అందులో ఇలా వుంది. 
 
"ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు. తెలంగాణ ప్రజలు మాదిరిగా అంతా కట్టుగట్టుకుని కేసీఆర్‌కు ఓటు వేసినట్లు వేయరు. ఇక్కడ కులాలవారీగా కొట్టుకు చస్తారు. తెదేపా కులాలను ఆధారం చేసుకునే గెలుపు లెక్కలు వేసుకుంటుంది. బాబు బతుకే అంత. అందుకే మనం గెలిచేశాం అనే భ్రమలో వుండొద్దు. ఈసారి ఓడితే వైఎస్సార్సిపి పరిస్థితి ఖతం. వైకాపాను నమ్ముకున్నవారంతా అడుగంటి పోతారు. జాగరూకతతో వుండండి.
 
పవన్ కల్యాణ్ వల్ల తెదేపాకి నష్టం అంటున్నారు. వైసీపికి ఎంత నష్టమో తెలుసా?. గోదావరి జిల్లాల్లో జనసేన కారణంగా వైసీపీ నష్టపోతున్న ఓట్లు ఎన్నో మీకు తెలుసా? భారతదేశంలోనే అత్యంత నీచమైన నాయకుడితో పోరాడుతున్నారు జగన్. అందుకే చాలా జాగ్రత్తతో వుండాలి. మనం గెలిచేస్తున్నాం అంటే ఏ నాయకుడైనా ఏమనుకుంటారు? నిజమేనన్న భ్రమలో వుంటారు. అలా ఎవ్వరూ అనుకోవద్దు. బాబు దుర్యోధనుడిలాంటివారు, జాగ్రత్త. 
 
చంద్రబాబు ఎట్టి పరిస్థితిల్లోనూ ఓటమికి లొంగడు. జగన్ మోహన్ రెడ్డిపై మోపిన 13 కేసుల్లో ఆధారాలు దొరక్కపోతే కోర్టులు ఎందుకు తిప్పుతున్నారు? మనం బలం నిరూపించుకున్న తర్వాత మోదీ చేసేదేముంది? ఇప్పుడొచ్చి ఏదో సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు. మోదీ ఏమీ చేయడు, ఆయన పచ్చి స్వార్థపరుడు. 
 
గెలిచేశాం అనే భ్రమలో వుండొద్దు. అవసరమైతే చంద్రబాబు మళ్లీ వెళ్లి పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుంటాడు." ఇలా సాగింది ఆ ఆడియో టేపు. మరి ఇందులో నిజమెంతన్నది తేలాల్సి వుంది. చూడండి వీడియో ఇందులో...